పిల్లల ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యం అంటే ఏమిటి ?

ఆరోగ్యం అనేది పూర్తి శారీరకంగా ధృడంగా మరియు మానసిక స్థితి సమన్వయంగా ఉండే ఒక స్థితి . శారీరకంగా ధృడంగా ఉండటం వలన ఎలాంటి అనరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎముకలు కండరాలు బలంగా తయారవుతాయి.

మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మనల్ని మనము కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడికి గురికాకుండ ఉండటం వలన మనస్సు ఎప్పుడు సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉంతుంది , మెదడు కూడా బాగా పనిచేస్తుంది , నరాలు బలహీంపడకుండా ఉంటుంది.

శరీరాన్ని కాపడుకోవడానికి కొన్ని నియమాలు
  1. సూక్ష్మ క్రిములను నివారించడానికి మీ చేతులు మరియు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి 

లాభాలు : 

* ఎప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచడం వలన సూక్ష్మ క్రిములు దరిచేరవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

* జలుబు, దగ్గు , జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

2.రోజుకి రెండు సార్లు పళ్ళు శుభ్రంగా తోముకోవాలి: –
 * తెల్లవారుజామున నిద్రలేవగానే పళ్ళు తోమాలి. రాత్రి భోజనం చేసిన తరువాత పడుకునే ముందు మరళ ఒకసారి పళ్ళు తోముకొని పడుకోవాలి . 

లాభాలు : 

*అలా రోజుకు రెండు సార్లు అయిన పళ్ళు తోమడం వలన క్రిములు పోతాయి . దంతాలు బలంగా తయారవుతాయి .

ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇబ్బందులు రాకుండా ఉంటుంది. 

* ఎలాంటి దుర్వాసన రాకుండా ఎప్పుడు శుభ్రంగా ఉంటారు.
 

  1. తినడానికి ముందు తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం  

లాభాలు : 

ఎలాంటి దుమ్మూ ధూళి , సూక్ష్మ క్రిములు ఉన్నా తొలగి పోతాయి .మనకు మరియు ఇతరులకు ఎలాంటి సమస్యలు రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు .

  1. రోజు స్నానం చేయడం 

లాభాలు : రోజు ఉదయం లేవనగానే ( ఫ్రొం 5.30 – 8.00 am) స్నానం చేయడం చాలా మంచిది.

సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేయడం ద్వారా శరీరంపై ఉన్న సూక్ష్మ-క్రిములు పోతాయి . శరీరం  ఆరోగ్యంగా ఉంటుంది . మీ మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది. 

గమనిక :  భోజనం చేసే ముందు  మరియు భోజనం తరువాత మీరు కనీసం 30 నిమిషాలు వ్యవధి ని వదిలి స్నానం చేయవచ్చు .

  1. ఎప్పటికప్పుడు జుట్టుని శుభ్రంగా మరియు దువ్వెనగా ఉంచాలి  

లాభాలు : 

* జుట్టుని శుభ్రంగా ఉంచడం వలన ఎలాంటి చుండ్రు మరియు పేను రాకుండా ఉంటుంది.

* జుట్టుని శుభ్రంగా ఉంచడం వలన మీరు అందంగా కనపడటమే కాక, చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది . జుట్టు పాడవకుండా , జుట్టు రాలకుండా ఉంటుంది.

  1. ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన పోషకాహారం మన శరీరానికి ఇస్తూ ఉండాలి

లాభాలు : 

 పాలు , పండ్లు , ఆకు కూరలు , కూరగాయలు , కోడి గుడ్లు, దుంపలు , శరీరానికి ఇస్తూ ఉండడంవలన జీర్ణం తొందరగా అవుతుంది.

శరీరానికి  కావాల్సిన పోషక ఆహారం ( విటమిన్స్  , కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్  , మినరల్స్ …) అందడం వలన ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు .

  1. క్రమం తప్పకుండా గోర్లు కత్తిరించాలి 

లాభాలు : వారానికి లేదా పది రోజులకి ఒక్కసారి అయినా  గోర్లు కత్తిరించడం వలన , నోటికి సూక్ష్మ క్రిములు వెళ్ళకుండా , ధుమ్ముధూళి వెళ్ళకుండా తినే ఆహారం శుభ్రంగా శరీరానికి అందుతుంది.

  1. బయటికి వెళ్ళి రాగానే బట్టాలు మార్చాలి 

లాభాలు : ఎప్పటికప్పుడు  బట్టలు మార్చడం , శుభ్రంగా ఉంచడం వలన ఎలాంటి బ్యాక్టీరియా దరిచేరవు.

  1. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి 

లాభాలు : తగినంత నిద్ర ఉండడం వలన ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది  మరియు జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది .

ఇలా శరీరాన్ని కాపాడుకోవడానికి కొన్ని నియమాలని రోజువారీగా పాటించడం వలన మీ శరీరం ఎప్పుడు దృఢంగా , ఆరోగ్యంగా  మరియు మీ మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం వలన రోజు మీ దిన చర్యలు చక్కగా  చురుగ్గా చేసుకోగలరు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *