వాతావరణ మార్పుల వలన పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల వలన పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

 

వర్షాకాలంలో ఎక్కువగా ఫ్లూ వంటి వ్యాధులు ప్రభలే అవకాశం,కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.

 

వాతావరణంలో ఏర్పడిన మార్పులు వలన పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. సీజనల్ వ్యాధులకు గాలి నీరు దోమలే ప్రధాన కారణం.

 

టీకా మందులు వేయించడం: 

 

  •  టీకా మందులు (వ్యాక్సిన్) వేయించడం వల్ల పిల్లలు అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారు. 

 

  • టీకాలు వేయించడం వల్ల మీ పిల్లలను పోలియో వంటి తీవ్రమైన అనారోగ్యాల నుండి రక్షించగలరు

 

  • టీకాలు వేయించడం వల్ల పక్షవాతం, మెదడు వాపు మరియు అంధత్వానికి గురి కాకుండా కాపాడుకోగలరు

 

తులసి ఆకులతో కాచి వడబోసి  గోరు వెచ్చని  నీరు త్రాగడం. 

 

మనం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం ఎంత ముఖ్యమో.. నీళ్లూ అంతే అవసరం.

 

ప్రతి రోజూ సరిపడా నీళ్లు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండటానికి కాచిన నీళ్లు ఉపయోగించబడతాయి.

 

  • కాచడం ద్వారా సూక్ష్మ క్రిములు నశించి పోతాయి.

 

  • ఈ కాచిన నీళ్ళను వడబోసి , కొన్ని తులసి ఆకులను వేసి, గోరు వెచ్చగా చేసుకొని తాగిన చో గొంతు నొప్పి శ్వాస సంబంధించిన వ్యాధులు మరియు  నరాలు బలహీన పడకుండా ఉంటాయి .

 

  • గోరు వెచ్చని నీళ్ళు త్రాగిన చో మీ జీర్ణ శక్తి కూడ చక్కగా పనిచేస్తుంది. మల-మూత్ర విసర్జన ఎలాంటి  ఇబ్బంది లేకుండడ ఉంచగలరు.

 

  • ఇలా గోరు వెచ్చని నీళ్ళు త్రాగిన చో , చక్కటి చురుకైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

 

 

సరైన ఆహారం తీసుకోవడం. 

 

లాభాలు: 

 

కార్బోహైడ్రేట్‌లు లేదా పిండిపదార్థాలు శరీరానికి శక్తిని ఇస్తాయి.  ప్రోటీన్లు, మీ శరీరం అంటువ్యాధులతో పోరాడడానికి, మీ కణాల నిర్మాణానికి, వాటిని బాగు చేయడానికి సహాయపడతాయి.  కొన్ని రకాల కొవ్వు పదార్థాలను సరైన మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి;  అవి శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. 

 

విటమిన్ సి , విటమిన్ డి ,జింక్ , ప్రోటీన్స్ అందడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది. 

 

దోమతెరలు వాడటం: 

 

శరీరానికి లేపనం రాస్తూ ఉండటం వలన దోమల బారి నుండి ఇప్పించుకోగలుగుతాము.  

 

అలాగే ఇంట్లో దోమల   కాఇల్స్   మరియు కిటికీలకు తలుపులకు  (డోర్స్ ) దోమతెర ఉండేలా చూడాలి. 

 

ఆవిరి పట్టడం: 

 

లాభాలు:  

 

  • ఆవిరి పట్టడం వలన నాసిక రంధ్రాలు శుభ్రంగా ఉంటాయి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

  • కేవలం కాసేపు ఆవిరి పట్టడం వల్ల ఫ్లూ, ముక్కు దిబ్బడ లక్షణాలు తొలగి పోతాయి. పైగా ఎంతో ఉపశమనంగా కూడా ఉంటుంది. 

 

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి: 

 

లాభాలు: 

 

ఇంటిని ఎప్పుడు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం వాంతులు విరోచనాలు రాకుండా అరికట్టవచ్చు, స్నానాల గది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 

 

బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి: 

 

బట్టలు శుభ్రంగా ఉతుక్కోవాలి సూర్యకిరణాలు (ఎండ) తగిలేలా బయట ఆర వేయాలి

తడి బట్టలు ఎప్పుడు వేసుకోకూడదు.

 

లాభాలు : 

 

  • బట్టలు బయట సూర్య కిరణాలు తగిలేలా వేయడం వలన ఎలాంటి సూక్ష్మ క్రిములు లేకుండా పోతాయి.

 

  • ఎలాంటి చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

ఇలా నియమాలను పాటించడం వలన మీ శరీరం ఎప్పుడు దృఢంగా, ఆరోగ్యంగా మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం వలన  మీరు మీ  కుటుంబాన్ని సంరక్షించుకోగలుగుతారు.